శుభలగ్నం సీక్వెల్.. మళ్లీ జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా నటిస్తారా?

బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:01 IST)
ఒకప్పటి హీరో, ప్రస్తుత విలక్షణ నటుడు జగపతిబాబు నటించిన శుభలగ్నం సినిమాకు సీక్వెల్ రానుంది. జగపతిబాబు కెరీర్‌లో శుభలగ్నం సినిమా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఇందులో రోజా, ఆమని హీరోయిన్లుగా నటించారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్ ''యాత్ర'' సినిమాను నిర్మించిన 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తను డబ్బుకోసం అమ్ముకునే పాత్రలో ఆమని కనిపించిన సంగతి తెలిసిందే. ఆమని భర్త అయిన జగపతిబాబును కోటి రూపాయలకు రోజా కొనుగోలు చేస్తుంది. 
 
ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అదే చిత్రానికి 25ఏళ్ల తర్వాత ప్రస్తుతం సీక్వెల్ రానుంది. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. తాజాగా హీరో హోదా నుంచి విలన్‌గా మారి భారీ పారితోషికం పుచ్చుకుంటున్న జగపతి బాబు ప్రధాన పాత్రధారిగా కనిపించనున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు