భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన మంగళవారం బూర్గంపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నిందితుడు షంషీర్ పాషా అనే ఆటో రిక్షా డ్రైవర్ తన భార్య మహమూదా బేగం (30)ను తెల్లవారుజామున పాముల సాహెబ్ స్ట్రీట్‌లోని వారి నివాసంలో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, పాషా మద్యం,ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. దానిని అతని భార్య వ్యతిరేకించింది. ఆ అలవాట్లను మానుకోవాలని ఆమె తరచూ అతన్ని కోరింది.
ఇది పదేపదే గొడవలకు దారితీసింది. సోమవారం రాత్రి, దంపతుల మధ్య మరోసారి వాదన జరిగింది. ఆ తర్వాత ఆవేశానికి గురైన షంపీర్ ఆమెను హత్య చేశాడని మృతురాలి తల్లి మీడియాకు తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, స్థానిక సబ్-ఇన్‌స్పెక్టర్ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.