ఈ కేసులో 72.6 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు తరుణ్ కొండూరు రాజును దోషిగా తేల్చడంతో రూ.62 కోట్ల జరిమానాను విధించింది. ఇక 63.61 కిలోల గోల్డ్ అక్రమ రవాణాకు బాధ్యులుగా తేలిన సాహిల్ జైన్, భరత్ జైన్ ఇద్దరికీ రూ.53 కోట్లు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
డీఆర్‌ఐ తన షో-కాజ్ నోటీసులకు 2,500 పేజీలకు పైగా పత్రాలను అందించి, కస్టమ్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలను ప్రారంభించింది. త్వరలోనే ప్రాసిక్యూషన్ చేపడతామని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించిన COFEPOSA (విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం) పిటిషన్‌ను హైకోర్టులో మంగళవారం విచారించి సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. రికవరీని నిర్ధారించడానికి దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు డీఆర్ఐ తెలిపింది.