అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం, షూటింగ్స్ ఆగిపోవడం, ఇండస్ట్రీలో పరిస్థితులు తలకిందులు కావడంతో మూవీ మళ్లీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా 'ఆచార్య' చిత్రం వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
"కరోనా వలన చిత్రాన్ని మే 13న విడుదల చేయడం లేదు. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీని ప్రకటిస్తాం" అని మేకర్స్ తెలియజేశారు. కరోనా వలన నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’, విశ్వక్‌సేన్ ‘పాగల్’ రిలీజ్‌లు వాయిదా పడ్డ విషయం తెలిసిందే.