ద‌ళ‌ప‌తి విజ‌య్‌ 69వ చిత్రం ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రకటన

డీవీ

శనివారం, 14 సెప్టెంబరు 2024 (08:20 IST)
Vijay
కోట్లాది మంది ఎదురు చూస్తోన్న క్ష‌ణాలు వ‌చ్చేశాయి. చ‌రిత్ర సృష్టించ‌టానికి కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్ సిద్ధంగా ఉంది. ఈరోజు ఫ్యాన్స్‌కు 5 నిమిషాల 30 సెక‌న్ల హృద‌యానికి హ‌త్తుకునే వీడియోతో ఓ ఎమోష‌న‌ల్ రోల్ కోస్ట‌ర్‌ను అందించారు. ఇందులో ద‌ళ‌ప‌తి విజ‌య్ తిరుగులేని లెగ‌సీని సెల‌బ్రేట్ చేశారు. ఇదొక సాధార‌ణ‌మైన బహుమతి అయితే కాదు. ఇదొక ముగింపుకి ప్రారంభం.. ద‌ళ‌ప‌తి 69.. ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి సినిమాకు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది.
 
కె.వి.ఎన్ ప్రొడ‌క్ష‌న్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప్ర‌క‌ట‌న‌ల్లో ఇదెంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ప్రేక్ష‌కులు, అభిమానుల హృద‌యాల‌కు కెవిఎన్ ద‌గ్గ‌ర‌గా వెళ్లింది. ఇదేదో ప్ర‌త్యేక‌మైన రీల్ మాత్రం కాదు. ఇండియ‌న్ సినిమాలో, అభిమానుల గుండెల్లో మ‌రెవ్వ‌రూ సంపాదించ‌లేని గొప్ప స్థానాన్ని ద‌క్కించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి సంబంధించింది. అంద‌రి గుండె లోతుల్లో అస‌మాన‌మైన ఆయ‌న స్థానానికి సంబంధించింది. వీధుల్లో, స్టేడియాల్లో అత‌ని పేరుతో వ‌చ్చే ప్ర‌తిధ్వ‌నికి ఈ వీడియో ఓ స‌జీవ సాక్ష్యంగా నిలిచింది.
 
ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాల‌నేవి కేవ‌లం ఆస్వాదించ‌టానికే కాదు, అవి జీవితాన్ని మార్చాయి. అభిమానుల భావోద్వేగాలతో వారి హృద‌యాలు అత‌ని రూపంతో నిండిపోయాయి. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ లేనివిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న న‌గ‌రాలన్నీ భావోద్వేగంతో కూడిని నిరీక్ష‌ణ‌తో ఎదురు చూశాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌ను మించి లార్జ‌ర్ దేన్ లైఫ్ అనేలా సినిమాలు చేసిన వ్య‌క్తిని వెండితెర‌పై చివ‌రిసారి వీక్షించ‌టానికి, గౌర‌వించ‌టానికి మేమంతా సంఘ‌టితంగా ఉన్నామ‌ని అంద‌రూ అంటున్నారు.
 
ఈ చిత్రంతో తలపతి తన నటనా జీవితాన్ని 'ముగిస్తాడని' వార్తలు వస్తున్నాయి. ఇక తన దృష్టిని పూర్తిగా తన రాజకీయ విధులపై కేటాయించనున్నాడు. ధీరన్ అధిగారం ఒండ్రు (2017), నేర్కొండ పార్వై (2019), వాలిమై (2...) చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ అని DH తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు