ఫస్ట్ బీట్ వీడియోను గమనిస్తే.. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్న, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కించారు. టెక్నాలజీ పరంగా ఎన్నో మలుపులు తీసుకుని ముందుకెళుతోన్న నేటి సమాజంలో ఇప్పటికీ ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయా? అని ఫస్ట్ బీట్ వీడియోను గమనిస్తుంటే ఆశ్చర్యమిస్తోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్, రేఖ భోగవరపు కాస్ట్యూమ్ డిజైనర్, ఎడ్వర్డ్ స్టీవ్‌సన్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అనీష్ మరిశెట్టి కో ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.