ఛత్రపతి శివాజీ పేరుతో గతంలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పురాణాల నేపథ్యాలు, పోరాటయోధుల కథలు వస్తున్నాయి. ఆ కోవలో ఛత్రపతి శివాజీ సినిమా రాబోతుంది. ఇందులో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నేడు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పలేని కథను తెలియజేస్తున్నామని ప్రకటించారు. 21 జనవరి 2027న గ్లోబల్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేయనున్నామని తెలిపారు. సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపారు.
ఇది కేవలం సినిమా కాదు - అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన, శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం యొక్క శక్తిని సవాలు చేసిన యోధుడు, ఎప్పటికీ మరచిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధుని గౌరవించటానికి ఇది ఒక యుద్ధ నినాదం.