దీపావళి పండుగ రోజున కొత్త సినిమా పోస్టర్లు సందడి చేశాయి. తమిళ అగ్రహీరోలై ధనుష్, విజయ్‌లతో పాటు టాలీవుడ్ హీరో రవితేజ, సమంతలు నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేశారు. ఇందులో రవితేజ "రావరణాసుర"గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. అలాగే, సమంత "యశోద"గా కనిపించనున్నారు. విజయ్ "వారసుడు"గాను, ధనుష్ ద్విభాషా చిత్రం "సార్"గా వస్తున్నారు.
సమంత ప్రధాన పాత్రను పోషించిన "యశోద" చిత్రం వచ్చే నెల 11వ తేదీన విడుదలకానుంది. దీపావళిని పురస్కరించుకుని ఈ చిత్ర బృందం కొత్త పోస్టరును రిలీజ్ చేసింది. హీరో రవితేజ "రావణాసుర" నుంచి కూడా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానరులో నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన విడుదలకానుంది.
తమిళ అగ్రహీరో విజయ్ కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో "వారసుడు". తమిళంలో "వారిసు" పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్. తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలారు.