దీపావళి సెలెబ్రేషన్స్ కోసం కార్గిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ

సోమవారం, 24 అక్టోబరు 2022 (11:41 IST)
దేశ సరిహద్దు భద్రతలో నిమగ్నమై ఉన్న భద్రతా బలగాలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకుంటారు. దీపావళి పండుగను సోమవారం లడఖ్‌తో పాటు దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి పండుగను ప్రజలు కొత్త దుస్తులు ధరించి, మిఠాయిలు పంచుతూ, పటాకులు పేల్చి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. 
 
అయితే, సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులతో కలిసి ప్రతి సంవత్సరం దీపావళి జరుపుకోవడం ప్రధాని మోడీకి అలవాటు. 2014లో ప్రధాని మోడీ సియాచిన్ ప్రాంతంలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. 2015లో పంజాబ్‌ సరిహద్దుల్లో, 2016లో హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో సేవలందించిన సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 
 
2017లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న సైనికులతో, 2018లో ఉత్తరాఖండ్‌లో పనిచేస్తున్న సైనికులతో, 2019లో జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న సైనికులతో దీపావళి జరుపుకున్నారు. 2020లో రాజస్థాన్ సరిహద్దులో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోడీ, గతేడాది జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలతో దీపావళి జరుపుకున్నారు. 
 
ఈ యేడాది ప్రధాని మోడీ దీపావళిని లడఖ్ సరిహద్దులో సైనిక సైనికులతో జరుపుకుంటున్నారు. కార్గిల్ ప్రాంతంలో భద్రతాలో నిమగ్నమైన ఆర్మీ సిబ్బందితో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకోసం ప్రధాని కార్గిల్‌కు సోమవారం ఉదయం చేరుకున్నారు. అక్కడి భద్రతా బలగాలతో ఆయన కలిసిపోయి ఈ పండుగను జరుపుకోనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు