ప్రముఖ నటి దీపికా పదుకునేకు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. దీపికా పదుకొణె-షారుక్‌తో కలిసి 'పఠాన్' చిత్రంలో నటించింది. తాజాగా ఈ చిత్రంలోని పాటను విడుదల చేశారు. ఈ పాటలో అసభ్యకరంగా డ్యాన్స్ చేయడంతో పాటు డ్రెస్ అభ్యంతరకరంగా వుందని విమర్శలు వచ్చాయి.
దీంతో బాయ్‌కాట్ పఠాన్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దీపికా పదుకొణెను హెచ్చరించారు.
ఈ పాటలోని సన్నివేశాలు, కాస్ట్యూమ్స్‌ను సరి చేయాలని, లేనిపక్షంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను విడుదల చేయకుండా నిషేధిస్తామన్నారు. ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.