నా పక్కన ఒక అందమైన అమ్మాయి! మళ్లీ రొమాన్స్ : నాగ్

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:08 IST)
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. ఈ చిత్రంలో దేవ్‌గా నాగార్జున నటిస్తుంటే దాస్‌గా నాని నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. చాలా కాలం తర్వాత మణిశర్మ స్వరాలను సమకూర్చారు. ఇందులో హీరోయిన్లుగా రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు నటిస్తున్నారు.
 
వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, దేవ(నాగ్) లవర్ జాన్వి(ఆకాంక్ష)ని చిత్రబృందం పరిచయం చేసింది. ఆమె పిక్ ఉన్న ఓ పోస్టర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిత్రబృందం 'దేవ లవర్ ఆకాంక్షను పరిచయం చేస్తున్నాం. ఆమె దేవదాస్ చిత్రంలో జాన్విగా నటిస్తోంది' అని ట్వీట్ చేసింది. ఇదిచూసిన నాగ్ మరో ట్వీట్ చేశారు. 'చాలా రోజుల తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి! మళ్లీ రొమాన్స్ చేయడానికి. దేవదాస్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం లిరికల్ వీడియో రిలీజ్ చేస్తున్నాం' అని ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు