'నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందే' అంటున్న శ్రేయ ఘోషల్ (Video)
మంగళవారం, 15 ఆగస్టు 2017 (16:09 IST)
అందరూ కొత్త నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం "దళపతి". ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, వినోద్ యజమాన్యతో కలిసి పాడిన ఓ పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ కొత్త చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి సదానందరెడ్డి దర్శకత్వం వహించగా, వినోద్ యజమాన్య సంగీతం సమకూర్చి, ఈ పాటను అద్భుతంగా పాడటమే కాకుండా సూపర్‌గా కంపోజ్ చేశాడు. ఆ పాట మీరూ వినండి. ఈ చిత్రాన్ని ఆదిఅక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత బాబూరావు పెదపూడి నిర్మిస్తున్నారు.