భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్ హీరోలు తమ స్పందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశం మొత్తం వైభవంగా జరుపుకుంటున్న తరుణంలో అభిమాన నటులు సోషల్ మీడియా ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
									
				
	 
	జై హింద్! స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- అమితాబ్ బచ్చన్
	ఫ్రీడమ్ అనేది వెలకట్టలేనిది. దాన్ని గౌరవిద్దాం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- మహేశ్ బాబు 
 
									
				
	మన జాతీయ జెండా మరింత పైకి ఎగరాలి. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- రాంచరణ్
	నా స్నేహితులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు- అక్కినేని నాగార్జున
 
									
				
	స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి సెల్యూట్ చేద్దాం- తమన్నా
	తిప్పరా మీసం.. భారతదేశం.. గర్వించాల్సిన క్షణం - రామ్