మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ దుమ్మురేపుతోంది. రిలీజైన వారంలోగా 51 లక్షల పైగా లైకులని సొంతం చేసుకొంది. దీంతో.. 'ధృవ'తో హిట్ కొట్టాలని కసితో ఉన్న చరణ్‌కి శుభారంభం దొరికినట్టయ్యింది. ఈ రికార్డ్‌ని చూసి మెగా అభిమానులు కూడా మురిసిపోతున్నారు.