బాలీవుడ్లో ప్రేమాయణాలు, బ్రేకప్‌లు, బాయ్ ఫ్రెండ్స్ మార్పిడి వంటి న్యూసే హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మలైకా అరోరా.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ సతీమణి. అర్భాజ్ ఖాన్ అరోరాను అక్రమ సంబంధం కలిగివుండటంతోనే పక్కనబెట్టేశాడు.
ఈ వార్తల్ని ఓ రిపోర్టర్ ప్రస్తుతం బట్టబయలు చేశాడని సమాచారం. చాలా రోజులుగా ఓ రిపోర్టర్ అర్జున్‌ని ఫాలో అవుతున్నాడు. ఓ సారి అతని కంటికి చిక్కిన అర్జున్.. మలైకా అరోరా ఇంటికెళ్లి చాలాసేపటికి తర్వాత తిరిగొచ్చాడట. ఈ విషయంలో బోనీ కపూర్‌కు తెలిసి అర్జున్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడట. కానీ మలైకా మాత్రం అర్జున్ను వదిలి ఉండట్లేదని సమాచారం.