విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్
డీ ఓ పి : KU మోహనన్, సంగీతం : గోపీసుందర్, ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ, నిర్మాతలు : రాజు - శిరీష్, రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల