నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. విడుదలకు ముందు ఏ స్థాయిలో జోరు కనిపించిందో ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద 'డాకు' జోరు నడుస్తోంది. దీంతో చిత్రానికి సీక్వెల్ ఉంటుందా అనే చర్చ మొదలైంది.
సినిమాలో ఓ విగ్రహం తల లేకుండా కనిపిస్తుందని, ఇదే పాయింట్‌ను హీరోగా చేసి 'డాకు మహారాజ్' ప్రీక్వెల్'గా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. దీంతో ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ప్రీక్వెల్ బాలకృష్ణతోనే ఉండబోతుందా? లేక వేరే యాక్టర్ ఎవరైనా కనిపిస్తాదా? అనేది హాట్ టాపిక్‌గా ఉంది.