సినిమా ప్రమోషన్స్ నుండి విడుదలయ్యే వరకు ఎంతో ఉత్సాహంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు. నా నటీనటులు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మరియు వివిధ పరిశ్రమలకు చెందిన ఇతర ప్రతిభావంతులైన కళాకారులు, నా సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రాఫర్ ఎంఎస్ దులీప్ కుమార్, స్వరకర్త అమ్రిష్ మరియు ముఖ్యంగా నా నిర్మాతలు దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి, రింకు కుక్రెజ, నా అసిస్టెంట్లు ఇలా మొత్తం టీం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.
భవిష్యత్తులో కొత్త, పెద్ద, గొప్ప కథలతో మిమ్మల్ని మరింత అలరిస్తానని ఆశిస్తున్నాను అని దర్శకుడు రత్నం కృష్ణ తెలిపారు.