అలాగే వినిస్ట్రన్ చర్చిల్-ఫ్యాములా హైదరాబాద్ వీధుల్లో ఏనుగుపై తిరిగేవారట. కోఠి ఉమెన్స్ కళాశాల చుట్టూ ఓ గొప్ప ప్రేమ కథ ఉంది. ఇలా హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రేమ కనిపిస్తుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా దేశంలో ఎక్కడా లేని చరిత్ర ఉంది. పీవీ నర్సింహారావు, నాగేశ్ శర్మ, శ్యామ్ బెనగల్, అజారుద్దీన్ ఇలా అనేక రంగాల్లో గొప్పవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లినవాళ్లు.
హైదరాబాద్ అంటే అంత ప్రేమ మనకు. సినిమాలతో కూడా ఇక్కడ ప్రేమలో పడొచ్చు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు వచ్చాయి. మన ప్రాంతం, మన దేశం అని కాకుండా ప్రపంచమంతా చూసే సినిమాలు వస్తున్నాయి. ఈరోజు మనం లేకున్నా రేపు మన సినిమాలు బతికే ఉంటాయి. సినిమా అనేది నా దృష్టిలో ఏంటంటే... సొసైటీలో చెడు ఉందని, అదే తీస్తున్నామంటారు కొంత మంది. సినిమాలు ఇట్లనే ఉంటాయంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్ సినిమా తీయాలి. కానీ చెడును సవరించేలా ఉండాలి. మంచిని ప్రొత్సహించేలా ఉండాలి. సినిమా ద్వారా మంచి మార్పును తీసుకొచ్చేలా ఉండాలి. ఇదే విషయాన్ని నేను నా సినిమాల ద్వారా ప్రయత్నిస్తుంటాను. సినిమా అనేది యూనివర్శల్ గా ఉండాలి. న్యూయార్క్ లో భాష తెలియని వాడు కూడా చూస్తే అతనికి అర్థం కావాలి. సినిమాకు యూనివర్శల్ అప్పీల్ ఉండాలి. ఇవాళ తీసిన సినిమా మరో పదేళ్లైనా చూసేలా ఉండాలి. పాత పడకూడదు. ఆది చూశాక గర్వపడేలా ఉండాలి. పిల్లలతో కలిసి చూసేలా ఉండాలి.
కానీ ఇది ఎలా సాధ్యమంటే... సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. అందుకే కిందిస్థాయి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాలి. డాక్యుమెంటరీ, ఫిల్మ్ ఏది తీసినా, ఎక్కడ పోస్టు చేసినా దిగువ స్థాయిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంపథితో చూడాలి. మనిషి-జంతువువైపు ఆలోచిస్తే జంతువు తీసుకోవాలి. పురుషుడు-స్త్రీ అంటే స్త్రీ వైపు ఆలోచించాలి. మన ఈగోలను పక్కనపెట్టి ఎంపథితో వెళ్లాలి. ఐన్ స్ట్రీన్ కూడా గాంధీని గొప్ప మనిషిగా భావిస్తాడు. అదే దారిలో నేను సినిమాలు తీస్తాను. అందుకేచాలా మంది నా సినిమాలను ఇష్టపడతారు. విద్యార్థులు మీరు ఏం కల కంటున్నారో వాటిని సాధించేందుకు కృషి చేస్తే గొప్పవాళ్లు అయినట్టే. "