ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఆయన పర్యటనను అధికారికంగా ప్రకటించింది. యూరోపియన్ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత, చంద్రబాబు ఏప్రిల్ 22న ఢిల్లీకి తిరిగి వచ్చి, 23న కేంద్ర మంత్రులతో సమావేశమై, విజయవాడకు తిరిగి వస్తారని భావిస్తున్నారు.
ఈ పర్యటన ఎందుకు అంత ప్రత్యేకమైనదంటే.. ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. తన "వజ్రోత్సవ" పుట్టినరోజును జరుపుకోవడానికి, ఆయన అధికారిక విధులు, ప్రజా కార్యక్రమాలకు దూరంగా తన కుటుంబంతో సమయాన్ని గడపాలనుకుంటున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో - ఎక్కువగా ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నాయకుడిగా, గడిపిన ఆయన కుటుంబంతో గడిపే సమయం చాలామటుకు తగ్గడంతో.. తన 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారు.