కర్ణాటక సంగీతం 1910 తరువాత జనాదరణకు దూరమైపోయింది. ఆ తరుణంలో దాన్ని బతికించి, జనాళి ఆమోదాన్ని, ఆదరణను పొందేట్టు చేసిన మేధావంతమైన కళాకారులు మహారాజపురం విశ్వనాద అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యన్ తదితరులు వున్నారు. తమ మేధతో, గానప్రతిభతో కర్ణాటక సంగీతానికి పునః వైభవాన్ని తీసుకువచ్చారు.