గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!

ఠాగూర్

సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (16:12 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించి డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని పాల్వంచలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారం అందించారు. 
 
గత 2023లో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసులో కేపీ చౌదరి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలీ' తెలుగు వెర్షన్ నిర్మాతల్లో ఈయన ఒకరు. 
 
అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. అయితే, 'కబాలీ' నష్టాలతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయినట్టు సమాచారం. కాగా, కేపీ చౌదరి తల్లి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు