ఇస్మార్ట్ శంక‌ర్... గోవాలో బాగా ఎంజాయ్ చేశామన్న చార్మి

మంగళవారం, 26 మార్చి 2019 (21:30 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్,  నభా నటేశ్ కథానాయికలు. పూరి జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసే పూరి.. రామ్‌ను కూడా స‌రికొత్త లుక్ లో చూపిస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ లుక్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. గ‌త‌ కొన్ని రోజులుగా ఈ సినిమా గోవాలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీల‌క‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.
 
నిన్న రాత్రితో అక్కడ షూటింగు పూర్తయింది. ఈ సందర్భంగా అంతా కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసినట్టుగా చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఆ సందర్భంలో దిగిన ఒక సెల్ఫీని షేర్ చేసింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను వారణాసిలో ప్లాన్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారని స‌మాచారం. ఆ తరువాత పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ విదేశాలకు వెళ్లనుంది. మే నెలాఖ‌రున లేదా జూన్ ఫ‌స్ట్ వీక్ ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు