మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మెగా ఫ్యాన్స్. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రికార్డులు బ్రేక్ చేస్తుండటం మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ 13.5 కోట్లకి అమ్ముడు పోయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత భారీ మొత్తం పలకలేదని.. సర్దార్ గబ్బర్ సింగ్ రూ.10 కోట్లు, బ్రహ్మోత్సవం రూ.13కోట్లకు పలుకగా, తాజాగా రిలీజ్ అ.ిన జనతా గ్యారేజ్ రూ.7.25 కోట్లకి అమ్ముడుబోయింది. అలాంటిది మెగాస్టార్ మూవీ వీటినన్నింటిని అధికమిస్తూ 13.5 కోట్లకి అమ్ముడుపోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో చిరంజీవి స్టామినా ఎలాంటిదో మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుండగా, కేథిరెన్ ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది.