శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో రా రాజా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
రోమాలు నిక్కబొడుచుకునేలా, వెన్నులో వణుకు పుట్టేలా కట్ చేసిన రా రాజా ట్రైలర్‌ను ఇది వరకే అందరం చూశాం. ఓ కెమెరామెన్ బ్రిల్లియన్స్, ఓ డైరెక్టర్ కొత్త విజన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్ పనితనం ఆ ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఒక్క యాక్టర్ మొహం కూడా చూపించకుండా కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్, రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరా యాంగిల్స్‌తోనే అందరినీ భయపెట్టేశారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఇంత వరకు సినిమా రాలేదు. అసలు ఇలాంటి ట్రైలర్‌ను ఇంత వరకు ఇండియన్ సినీ హిస్టరీలోనే చూసి ఉండరు.