బుల్లితెరపై సుధీర్ రష్మి జంటకు సూపర్ క్రేజ్ వుంది. జబర్దస్త్ నవ్వులు పండాలంటే వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ చేయాల్సిందే అన్నట్టుగా ప్రతివారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వీరిద్దర్నీ హైలైట్ చేస్తుంటారు. వీరిద్దరి మథ్య సంథింగ్ సంథింగ్ ఏదో వుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్న జబర్దస్త్ టీమ్ తాజాగా మరోసారి సుధీర్, రష్మీల కెమిస్ట్రీని వర్కౌట్ చేస్తూ ప్రోమో వదిలారు.
తాజా ప్రోమోలో మొదటిగా రోహిణి, రాకేష్‌లు వడదెబ్బ స్కిట్‌తో అదరగొట్టేశారు. రోహిణి అయితే టపా.. టపా అని ఎక్కడపడితే అక్కడ పడుతూ నవ్వులు కురిపించింది. ఆ తరువాత రాకేష్ మాస్టర్, నరేష్‌లు కొప్పులో మల్లెపూలు పెట్టుకుని తేడాగా కనిపించారు.
చలికాలంలో ఒక మామిడిచెట్టు ఇంకో మామిడిచెట్టుపై మనసు పడుతుంది.. రెండూ బాగా ప్రేమించుకోవడంతో వేసవి కాలంలో పళ్లు వస్తాయి అని చెప్తాడు. మరి వర్షాకాలంలో అని అడగ్గా.. ‘వర్షాకాలంలోనే మామిడిచెట్ల మధ్య మెయిన్ మ్యాటర్ జరిగేది’ అంటూ మార్క్ పంచ్ వేశాడు సుధీర్. దీంతో రోజా పడిపడి నవ్వగా.. రష్మి చేతులెత్తి దండం పెట్టేసింది.