ఐశ్వర్యా రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో పాటు గత రాత్రి కేన్స్‌కు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఆమె చేతి గాయాన్ని చూసి అందరూ ఒకింత షాక్ అయ్యారు. ఐతే ఐశ్వర్య తన సంయమనాన్ని పాటిస్తూ ఎవరు ఏమి అడిగినా చెప్పడానికి నిరాకరించింది, దీనితో అభిమానులు ఆందోళన చెందారు. ఆ గాయంతో రెడ్ కార్పెట్ పైన ఎలా నడుస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.