బుధవారంనాడు తెలుగు నిర్మాతలు మండలి సభ్యులు తిరుమలేశుని దర్శించుకున్నారు. వీరిలో కళ్యాణ్, ప్రసన్నకుమార్. మోహన్ వడ్లపట్ల, రామ సత్యనారాయణ, మోహన్ గౌడ్ లున్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఇటీవల సి.ఎం. జగన్తో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అందుకే తిరుపతిలో వున్న ఛాంబర్ బిల్డింగ్లను మరింత అభివృద్ధి చేయాలనుకుని ఈరోజు చూశాం. అదేవిధంగా హైదరాబాద్ కోకాపేటలో మూవీ టవర్స్ 1 కట్టి నిర్మాతలు ఒకేచోట వుండేలా చర్యలు తీసుకున్నాం. ఆ స్పూర్తితో మూవీ టవర్స్ 2 ఏర్పాటు చేయనున్నాం. ఇది మా నిర్మాతలు కి తీరని కల గా మిగిలి పోకుండా నెరవేర్చెటం కోసం మా ప్రయత్నంలో త్వరలో నిజం కానుంది అన్నారు.