బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పటికే క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో నటిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ 'కథనం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లోని లుక్‌ను బట్టి నెటిజన్లు ఇదో లేడి ఓరియెంటెడ్ సినిమా అని కామెంట్లు పెట్టారు.
కానీ ఆ ప్రశ్నేసిన తర్వాత కొంత సమయానికే తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని.. నిజాయితీగా అడిగానని చెప్పింది. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం వుంటుంది. సినిమాకు ప్రతి పాత్ర ముఖ్యమే. తామంతా పాత్రల్ని పోషిస్తున్నాం. సరైన విధంగా మమ్మల్ని పిలవాలనేది తమ అభిప్రాయం. ప్రధాన పాత్రలో ఆయన/ఆమె నటిస్తున్నారు అంటే సరిపోతుంది కదా అంటూ అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ అనసూయ కథనం ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.