తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పుట్టడం మన అదృష్టం, దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారు అని కీర్తించారు. తెలంగాణ సంస్కృతి, గుండె చప్పుడును విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు గద్దర్ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతి భావజాలాన్ని రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి స్పష్టమైన మార్గంలో గద్దర్ ప్రచారం చేశారని వివరించారు. ఆయన బానిని చిన్నపిల్లలు నుంచి ముసలి వాడి వరకు అనుకరించారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్తో గద్దర్ పాదయాత్ర చేసి ప్రత్యేక రాష్ట్రానికి నాంది పలికారని వివరించారు.
ఎక్కడో ఉన్న చిత్ర పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కు తరలించి ప్రోత్సహించింది అన్నారు. చిత్ర పరిశ్రమను తరలించి ప్రోత్సాహకాలు అందించడమే కాదు, సినీ పరిశ్రమ లో పనిచేసే వారికి ఇళ్ల స్థలాలను సైతం కేటాయించాం అన్నారు. సమాజంలో అభివృద్ధి, విలువలను ప్రోత్సహించేది మీడియానే, మీడియాను కాపాడుకునే బాధ్యత పాలకులపై ఉంది అన్నారు.
భవ బంధాలు, రాగద్వేషాలకు అతీతంగా అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జూరీ సభ్యులను డిప్యూటీ సీఎం కోరారు. సినిమా అవార్డులతో పాటు సినీ పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన వ్యక్తుల పేరిట అవార్డులు ఇస్తున్నాం, ఇవి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి అన్నారు.