Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

సెల్వి

మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (07:20 IST)
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఆమె ఆత్మహత్యకు కారణమైందని ప్రాథమిక విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. ఆకుల దీపిక (38) తన భర్త, పిల్లలతో కలిసి హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు.
 
అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆకుల దీపిక తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు