హైదరాబాద్ మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాల పాలైన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే శ్రీదేవిని మహేష్ వివాహం చేసుకుని క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
గత కొంతకాలంగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య శ్రీదేవితో పాటు అత్తపై మహేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో వుంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.