తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 1.82 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న గం..గం..గణేశా

డీవీ

శనివారం, 1 జూన్ 2024 (16:07 IST)
Ganesha collection
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". నిన్న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కిన "గం..గం..గణేశా" ఆడియెన్స్ కు హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి బాక్సాఫీస్ నెంబర్స్ మరింతగా పెరగనున్నాయి.
 
"గం..గం..గణేశా"లో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. "గం..గం..గణేశా" సినిమా హీరో ఆనంద్ దేవరకొండను సరికొత్తగా తెరపై ఆవిష్కరించింది. మంచి ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో ఆనంద్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు