గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆ సినిమాను ఏపీ లోకల్ టీవీలో ప్రసారం చేశారు. దీనిపై చిత్ర నిర్మాతలు, టీమ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విశాఖపట్టణం కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.