గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన, తాను, రామ్ చరణ్, వారి కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంతో పాటు, ఉపాసన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు."మీ నిరంతర ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు" అని ఉపాసన తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోటో ఆమె హృదయపూర్వక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోస్టుపై స్పందించిన అభిమానులు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.