టాలీవుడ్ అగ్ర హీరో, నందమూరి వారసుడు బాలయ్య బాబు నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా హిట్టా ఫట్టా అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. బుధవారం భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్రం హిట్ టాక్‌తో నడుస్తుంది.
ఈ నేపథ్యంలో గురువారం రిలీజైన బాలకృష్ణ నటించిన వందవ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా అఖండ భరత జాతి అంటూ కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంతో క్రిష్ తెరకెక్కించాడు. చిరంజీవి 150వ సినిమాతో పోటాపోటీగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించడంతో 'శాతకర్ణి'పై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీనికితోడు సినిమా ట్రైలర్ కూడా బాగుండటంతో ఈసారి సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమాపై పాజిటివ్ పల్స్‌గా మారిన బాలయ్య ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ స్పందన కూడా బాలయ్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని చెప్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయని వారు చెప్తున్నారు.
తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొదటి నుంచి చారిత్రక నేపథ్యంలో వచ్చిన చిత్రాలు అంటే తెలుగు వారు బాగా ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో గౌతమి పుత్ర శాతకర్ణి పాజిటివ్ పబ్లిక్ టాక్ వచ్చింది. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని తెగ పొగిడేస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు బాలయ్య నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి'కి కూడా మస్తుగా మార్కేలేశారు. తప్పకుండా గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా హిట్టేనని టాలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. క్రిష్ దర్శకత్వ సారథ్యంలో తప్పకుండా బాలయ్య హిట్ కొట్టారని సినీ పండితులు అంటున్నారు.