దక్షిణాదిలో క్రేజున్న దర్శకుడు గౌతమ్ మీనన్. వెంకటేష్‌తో ఒక పోలీస్ బ్యాడ్ డ్రాప్ చిత్రం ఘర్షణ, నాగచైతన్యతో ఏ మాయ చేసావే వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఓ తమిళ చిత్రంలో విలన్‌గా నటించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.
మొదట్లో ధనుష్ చిత్రంతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ కావని చెప్పాడట. ఆ తర్వాత స్క్రిప్ట్ విన్నాక, తనకు ఎంతో నచ్చడంతో విలన్ రోల్ చేస్తానని మాటిచ్చారట. ఇప్పటివరకూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ సాధించిన గౌతమ్, ఇప్పుడు విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు.