ఈ చిత్రానికి కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని ఓరి దేవుడా ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందుతోన్న 26వ సినిమా ఇది.
లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ మూవీలోని పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. లియోన్ జేమ్స్, నదీషా థామస్ పాడారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి ఈ పాటలో డాన్స్ చేయటం విశేషం. హీరో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ఆయన చేసిన డాన్స్ చూస్తుంటే అందరిలో సరికొత్త ఉత్సాహం కలుగుతుంది.
ఈ ఎమోషనల్ మూవీకి అర్చనా కల్పాతి క్రియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటే ఐశ్వర్యా కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎం.వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కె.ఎస్.రవికుమార్, మిస్కిన్, వి.జె.సిద్ధు, హర్షత్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.