ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

ఐవీఆర్

శుక్రవారం, 3 జనవరి 2025 (17:43 IST)
సింగర్ చిన్మయి శ్రీపాద బుధవారం అర్థరాత్రి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, Xలో మహిళల గురించి అవమానకరమైన పోస్ట్‌ను పెట్టిన వారిని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది. డిసెంబరు 31 అర్థరాత్రి, నూతన సంవత్సరం సందర్భంగా కోటికి పైగా కండోమ్స్ వినియోగించారనీ, ఈ ప్రకారంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కన్యగా వుండటం అదృష్టం అని ఓ వ్యక్తి పోస్ట్ పెట్టాడు.
 
కొత్త సంవత్సరం సందర్భంగా బ్లింకిట్ ప్లాట్‌ఫారమ్‌పై మొత్తం 1.2 లక్షల కండోమ్‌ల ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ సీఈఓ షేర్ చేశారు. దీనితో ఓ వినియోగదారుడు ఇలా రాసుకొచ్చాడు. "గత రాత్రి 1.2 లక్షల కండోమ్‌ల ప్యాకెట్లు డెలివరీ చేయబడినట్లు బ్లింకిట్ సీఈఓ పోస్ట్ చేసారు. కేవలం గత రాత్రి ఈ ఒక్క దాన్నుంచే ఇన్ని కొంటే ఇతర ఇ-కామర్స్ సైట్లు, మార్కెట్ విక్రయాలు 10 మిలియన్ల వరకు ఉంటాయి. బాగుంది ఈ తరంలో పెళ్లి చేసుకునేందుకు వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టం''.
 

Then men shouldn’t have premarital sex with women.
Unless said men are having sex with goats, dogs and reptiles. pic.twitter.com/sM3YJ3Myvg

— Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2025
చిన్మయికి ఈ ట్వీట్ అంతగా నచ్చలేదు, ఆమే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో, "పురుషులు స్త్రీలతో వివాహానికి ముందు సెక్స్ చేయడం మానేయాలి. మీ సోదరులు, మగ స్నేహితులను పెళ్లికి ముందు సంభోగంలో పాల్గొనవద్దని చెప్పండి. ఒకవేల కండోమ్స్ కొనాల్సి వస్తే వారు మేకలు, కుక్కలు మరియు సరీసృపాలతో సంభోగం చేయడానికి కొనుక్కోమనండి'' అంటూ ఘాటుగా స్పందించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు