- నేను కాలేజీలో ఉన్నప్పుడు, కాలేజీలో పేరు తెచ్చుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకున్నాను. కొత్త సంస్థ నన్ను సంప్రదించడంతో పిల్ల పిల్లగాడు పేరుతో వెబ్ సిరీస్ చేశాను. అప్పట్లో సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. అప్పుడు నాకు 19 ఏళ్లు. జియోకు ముందు కాలంలో కూడా ఇది మిలియన్ల కొద్దీ వ్యూస్‌ని సంపాదించుకుంది. దాని కంటెంట్ మాకు చాయ్ బిస్కెట్ సంస్థ ను ఆకర్షించింది. నేను అప్పట్లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాను. చాయ్ బిస్కెట్ నన్ను వెబ్ సిరీస్ చేయాలనుకున్నప్పుడు, నేను ఫీచర్ ఫిల్మ్ చేయడానికి ముందుకొచ్చాను. సినిమాల్లో సున్నా అనుభవం లేని ఫ్రెషర్‌గా, నేను సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నాను అని చెప్పడం చాలా ధైర్యంగా చెప్పడంతో ఓవర్ గా చెపుతున్నావు అన్నారు. ఆ తర్వాతే వారు నాకు చేస్ ఇచ్చారు.