అనంతరం నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, ఈ నిర్మాణ సంస్థ నా హోమ్ బేనర్. ఫంక్షన్‌కు పిలిస్తే ఎటువంటి అవకాశం వున్నా వస్తానని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ సోమచ్. మేం యూత్ అని గర్వంగా చెప్పుకునే టీమ్ అంతా నన్ను పిలిచారంటే నేనూ యూత్ అని ఎగ్జైట్ మెంట్ కలిగింది. మరోసారి అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. నిర్మాతలు గుడ్ కంటెంట్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఇది బిగినింగ్ మాత్రమే ఇలాంటివి డెకేట్ వరకు సెలబ్రేషన్ చేసుకోవాలి. దర్శకుడు సుమంత్ ప్రభాస్ గతంలో .చూస్తూ.. చూస్తూ. అనే ఓ సాంగ్ చేశాడు. అది చూశాక. తనలో మంచి ఛామ్ వుందనిపించింది. ఆ తర్వాత డాక్టర్స్‌కు అంకితంగా దారేలోదా.. అనే చిన్న షాట్ ఫిలిం తీసింది సుమంత్ కావడం విశేషం. ఇప్పుడు తనే హీరోగా, దర్శకుడిగా మారి మేమ్ ఫేమస్ చేయడం చాలా సంతోషంగా వుంది. నేను నా షెడ్యూల్ గేప్‌లో వచ్చాను. ఒంట్లో బాగోకపోయినా ఫంక్షన్‌కు రావాలని వచ్చాను. మీ సందడి చూస్తుంటే.. ఓ మాట అనాలనుంది.. అంటూ.. మీ ప్రమోషన్స్ చూశాను. ఈరోజుతో చాలు ఆపేయండి ఆ ట్రెండ్. మే 26న మేమ్ ఫేమస్‌కు తీసేయండి బాక్సాఫీస్ బెండ్..అంటూ డైలాగ్ చెప్పి హుషారెత్తించారు. అదేవిధంగా మీరంతా ఎంకరేజ్ చేయండి అంటూ ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడారు.
చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి నాని అన్న ముందుంటాడని వింటుంటాను. అది ఈరోజు చూశాను. చాలామంది ఫిలింమేకర్స్ ఇలా స్టేజ్ ముందు, అందరి ముందు ఇలా వుండాలనుకోవడం డ్రీమ్. అది నాకు 24 ఏళ్ళకే ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతున్నా. నా డైరెక్టర్ టీమ్ ఎంతో సాయం చేయబట్టే సినిమా బయటకు వచ్చింది. వారికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా టీమ్ అంతా పాజిటివితో కథ రాసుకుని ఇదే మన జీవితం అని పట్టుదలతో కథ రాసి తెరకెక్కించాం. మా సినిమా యూత్ కోసమే తీశాం. వల్గారిటీ లేని సినిమా. అందుకే మీరు చూసి ఆ తర్వాత థియేటర్‌కు పెద్దల్ని కూడా తీసుకువస్తారని ఆశిస్తున్నాం. 35 మంది ఆర్టిస్టులనేకాదు టెక్నీషియన్స్ కూడా కొత్తవారిని పరిచయంచేసే ఛాన్స్ నిర్మాతలు ఇచ్చారంటూ, పేరుపేరునా అందరికీ పరిచయం చేశారు. నాని దసరా థియేటర్లో చూసి డాన్స్ కూడా వేశామంటూ తెలిపారు.
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, మేమ్ ఫేమస్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. దసరా సినిమాను సుదర్శన్‌లో తల్లిదండ్రులతో చూశాను. ఆ ఎంజాయ్ ఎలా వుంటుందో నాకు తెలుసు. అలాగే మేమ్ ఫేమస్ టీమ్ కుటుంబాలు ఈ సినిమా చూసి అంత ఎంజాయ్చేస్తారని అనుకుంటున్నా. ఒక టైంలో మనకు బలుపు వుంటుంది. చేసే పనిలో తప్పో ఒప్పో తెలీని స్థితిలో నాన్న వుండి గైడ్ చేస్తారు. అలా నన్ను నాని గైడ్ చేశారు. అందుకే దసరా సినిమా చేయగలిగాను అన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, శ్రీకాంత్, నేను సుకుమార్ దగ్గర పనిచేశాం. ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే అంత ఈజీకాదు. శ్రీకాంత్ 18 కిలోమీటర్లు బైక్‌మీద వచ్చి సుకుమార్‌ను కలవాలని వచ్చేవాడు. అంత కష్టపడి ఇష్టంతో జాయిన్ అయ్యాడు. అలాగే ఈ సినిమా హీరో, దర్శకుడు అయిన సుమంత్‌కు పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.