ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్‌లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.
కాగా, టాలీవుడ్‌లోకి 'ముకుంద' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో "ఎఫ్ 2", "గద్దలకొండ గణేష్" చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే.