'ఎఫ్ 2' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రస్తుతం 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా - మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌కి ఫైనాన్స్‌ని జత చేసి మోర్ ఫన్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి.