పంచె కట్టులో పవన్ కల్యాణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

బుధవారం, 13 జనవరి 2021 (11:26 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు కారణం ఆయన కొత్త లుక్కే. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీగా ఉండడం వలన సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో పాటు 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రంలో రానా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. పవన్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తాయని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పవన్ తాజాగా పంచె కట్టులో మెరిశారు.
 
కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వస్తున్న పవన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ లుక్‌లో పవన్‌ని చూసిన అభిమానులు తెగ మెరిసిపోతున్నారు. ఇంకా ఫోటోలు నెట్టింట భారీగా షేర్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోటోలకు లైకులు వెల్లువెత్తుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు