రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం కోట బొమ్మాళి పీఎస్. అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేస్తుండగా.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లింగి లింగి లింగిడి అనే ఫోక్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రంలోని లింగిడి లింగిడి పాట ద్వారా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ పాటను డిజైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌కి అభినందనలు. ఈ సినిమా ఒరిజినల్ చూశాను. ఇందులో చాలా మార్పులు చేశారు. పాటతోనే ఎంత మార్చారో తెలుస్తుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా ఇందులో గన్ గవర్న్‌మెంట్‌ది.. వేలు మనది అనే డైలాగ్ బాగుంది. తేజ గత సినిమాలు చూశాను. తనకి, టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్. శ్రీకాంత్ లాంటి సీనియర్ హీరోను రియలిస్టిక్ క్యారెక్టర్‌లో చూస్తాం. వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్. అల్లు అరవింద్ గారు ధోనీ లాంటి వారు. వెనుక ఆయన ఉన్నారనే కాన్ఫిడెంట్స్‌తో బన్నీ వాసు, ఎస్‌కేఎన్ బాగా ఆడేస్తున్నారు. ఇప్పుడు విద్యా గారు వస్తున్నారు. ఆమె కూడా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్”అని చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్న విద్యా, భాను, రియాజ్ లకు నా బెస్ట్ విషెస్. రాజకీయ నాయకులు పోలీసులును ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే సినిమా ఉంటుంది. పోలీసులు పడే ఇబ్బందులు, బాధలు ఇందులో ఉంటాయి. చాలా సంతృప్తిని ఇచ్చిన కథ ఇది. తేజ మార్నితో పాటు మూవీ టీమ్ అందరికీ సినిమా సక్సెస్ సాధించి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా” అని అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ఇదొక హానెస్ట్ అటెంప్ట్. మా టీమ్ అందరి కష్టం. టీజర్ అందరికీ నచ్చిందనుకుంటున్నా. ఈ నెల 24న సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాం అని అన్నారు.
శివాని రాజశేఖర్ మాట్లాడుతూ .. టీజర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. మాకు సపోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. లింగిడి లింగిడి సాంగ్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ పాట తరహాలోనే సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా అని చెప్పారు.
చిత్ర దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.. లింగిడి లింగిడి సాంగ్‌ను ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. టీజర్ ద్వారా కథను కొంత చూపించాం. నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులే ఓ కేసులో ఇరుక్కుని ఎలా అవస్థలు పడ్డారనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అవకాశం ఇచ్చిన బన్నీ వాసు గారికి, అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్” అని చెప్పారు.
నిర్మాత విద్యా కొప్పినీడు మాట్లాడుతూ..“ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. లింగిడి పాటకు 30 మిలియన్ వ్యూస్ రావడం హ్యాపీ ”అని చెప్పారు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. “టీజర్ లాంచ్ అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఇందులోని లింగిడి లింగిడి పాటకు కూడా ఆయనే స్ఫూర్తి. రాజాది గ్రేట్ చిత్రంలోని గుమ్మ మామాడి సాంగ్ చూసి.. ఇందులో పాటకు జానపదం గీతం పెట్టాలని ఆలోచన వచ్చింది. లింగిడి లింగిడి పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాట వలనే మా సినిమాకు మరింత బజ్ వచ్చింది. తేజ డైరెక్షన్‌తో పాటు కాశీ నాగేంద్ర రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఈ డైలాగ్స్ ద్వారా మాపై కాంట్రవర్సీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్‌లో జరిగే చాలా విషయాలు దగ్గర్నుంచీ చూసిన అనుభవం నాకుంది. వాటిలో నుంచి చాలా సెటిల్డ్‌గా ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తేజ ఈ సినిమాలో బాగా చూపించారు. ఎలక్షన్స్‌లో పాల్గొనే వారికి, పొలిటిషీయన్స్‌కు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రభావితం చేసేలా ఉంటుంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందిచారు. సిస్టమ్ పాలిటిక్స్‌కు ఎలా లొంగిపోయిందనేది కాన్పెస్ట్. ఏ పార్టీకి కొమ్ము కాసేలా ఉండదు. టీమ్ అందరికీ ఈ చిత్రం మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పారు.
ఎస్‌కేఎన్ మాట్లాడుతూ..విద్యా కొప్పినీడి గారు మంచి చిత్రంతో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లింగిడి లింగిడి పాట ఇప్పటికే బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.
కో ప్రొడ్యూసర్స్ భాను, రియాజ్, రైటర్ కాశీ నాగేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, నిర్మాతలు ధీరజ్, వంశీ నందిపాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.