ఇపుడు అచ్చం ఇలాంటి డైలాగునే దర్శకుడు రాంగోపాల్ వర్మ చెపుతున్నాడు. 'గాడ్, సెక్స్, ట్రూత్' (జీఎస్టీ) పేరుతో ఆయన ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అదేసమయంలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది.
శృంగారమే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలోనే కాకుండా ఏ విషయంలోనూ తాను ఎవరికీ లొంగబోనని తాజాగా రామ్ గోపాల్ వర్మ అన్నారు. "తాను సింహంలాంటి వాడిని కాదని, దాని కన్నా పవర్ ఫుల్" అని చురకలంటించారు.
ఈ సినిమాకి గాడ్, సెక్స్, ట్రూత్ (జీఎస్టీ) అని పేరు పెట్టడానికి కారణం శృంగారాన్ని దేవుడే క్రియేట్ చేశాడని చెప్పడమేనని వర్మ చెప్పారు. గాడ్ క్రియేట్ చేసిన సెక్సుని తప్పని, స్త్రీలు ముడుచుకుని ఉండాలని ఇలా ఎన్నో భావాలను ప్రజలే సృష్టించారన్నారు.