అక్రమంగా అమ్మాయిలను తరలించడంతో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఇంకా వ్యభిచార గృహాల నిర్వహణలోనూ ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నట్లు తాజా నివేదికలో వెల్లడి అయ్యింది. మహిళలకు రక్షణ ఇవ్వడంపై ఏపీ సర్కారు కఠిన చర్యలు ప్రారంభించినప్పటికీ.. పట్టుబడిన వారు శిక్షల నుంచి తప్పించుకుని తిరుగుతూ.. మళ్లీ అదే పనిలో నిమగ్నమవుతున్నారు.
దీంతో ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. మనదేశంలో 2 కోట్ల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టు అంచనా. వీరిలో కేవలం 40 లక్షల మందే స్వచ్ఛంద్ధంగా వృత్తిలోకి వచ్చారని, మిగతా 1.6 కోట్ల మంది హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగమైన మహిళలు, బాలికలేనని తేలింది.
ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి మాట్లాడిన కమిటీ సభ్యురాలు సునీతా కృష్ణన్, వ్యభిచారం నిర్వహించేవారు, వ్యభిచార గృహాలు నిర్వహించే వ్యక్తులకు ఈ చట్టం కఠిన శిక్షలు విధిస్తుందని తెలిపారు. బాలికలను కొనేవారు అధికమవుతున్నారని.. తద్వారా అమ్మేవారు కూడా పుట్టుకొస్తూనే వున్నారని చెప్పారు.