ఇక ఈరోజు విడుదలచేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు, తను బ్లాక్ షేడ్స్‌తో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో, సిటీ యొక్క రాత్రి దృశ్యాన్ని చూడవచ్చు. చాలా కాలం తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో రఫ్ అండ్ స్టయిలిష్ లుక్‌లో కనిపించడం ఇదే తొలిసారి.
గాడ్ ఫాదర్ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి మరియు ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య తారాగణం.