పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (21:28 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని బర్త్ డే గిఫ్ట్ సిద్ధంగా వుందని వకీల్ సాబ్ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు. దాంతో పవన్ బర్త్ డే నాడు అభిమానులకు గిఫ్ట్ వస్తుంది అనేది తెలుస్తుంది కానీ అది ఏంటి అనేది మాత్రం తమన్ చెప్పలేదు. కాగా హిందీ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ద్వారా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు.. పవన్ కల్యాణ్.
 
ఈ సినిమా లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌పై కొన్ని కోర్టు సన్నివేశాలు, మరో ఫైట్ సీన్, ఒక పాట చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌లు న్యాయవాదులుగా కనిపించనుండగా మరో ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన మగువా మగువా అనే సాంగ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు