సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. జైలర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మేము, ఏషియన్ మల్టీప్లెక్స్ కలసి విడుదల చేయడం జరిగింది. ప్రేక్షకులు, మీడియా, ఇండస్ట్రీ అన్ని వైపుల నుంచి రజనీకాంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడిందని చెబుతున్నారు. చాలా ఆనందంగా వుంది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రలో చాలా సెంటర్స్ లో మాట్నీ నుంచి అదనంగా థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. జైలర్ కి ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము మొదటిసారి కలిసి విడుదల చేయడం, ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ... ఈ చిత్రం రైట్స్ ని ఇచ్చిన సన్ పిక్చర్స్, కళానిధి మారన్ గారికి ధన్యవాదాలు. జైలర్ చాలా పెద్ద సూపర్ హిట్. సన్ పిక్చర్స్ కి మరోసారి కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా వారితో కలసి పని చేయాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.